తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోస్ చిరంజీవి, బాల కృష్ణ, నాగార్జున, వెంకటేష్. 70 ఏళ్ళ వయసులో కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఇప్పటికి కష్టపడుతున్నారు. ఈ నలుగురు హీరోలు ఇప్పటికి పోటీ పడుతుంటారు
అయితే నందమూరి బాల కృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ కు ఒక క్రేజ్ ఉంది. ఈ కాంబినేషన్లో సింహ, లెజెండ్, అఖండ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించాయి. ఇప్పుడు తాజాగా అఖండ-2 పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు మన బోయపాటి శ్రీను
ఇప్పుడు మరో కాంబినేషన్ సెట్ అయ్యింది. అదేనండి వెంకటేష్, అనిల్ రావిపూడి. వీళ్ళ కాంబినేషన్ లో ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు వచ్చాయి. వీటిలో ఎఫ్ 2, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఎఫ్ 3 పరవాలేదనిపించింది. కామెడీ, ఫామిలీ సినిమాలకు పెట్టింది పేరైన వెంకటేష్ కు అనిల్ రావిపూడి కరెక్ట్ సెట్ అయ్యాడు. ఈ తరం దర్శకులు, హీరోలలో ఎక్కువ కామెడీ, ఫామిలీ బేస్ చిత్రాలు ఎవరైనా చేస్తున్నారు అంటే అది వెంకటేష్, అనిల్ రావిపూడి అని చెప్పవచ్చు
ప్రస్తుతానికి అయితే వెంకటేష్ కి చేతిలో సినిమాలు ఏమి లేవు. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ తరవాత ఇప్పుడు వస్తాయేమో చూడాలి. లేదంటే అనిల్ రావిపూడి వచ్చేవరకు వేచి ఉండాలి
ఇక నాగార్జున. ఇప్పటి వరకు ప్రత్యేకమైన కాంబినేషన్ ఏది సెట్ అవలేదు, చేసుకోలేదు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ సినిమాలో ధనుష్ తో కలిసి నటిస్తున్నాడు. అంతే కాకుండా లోకేష్ కనకరాజ్, రజనీకాంత్ తో తీస్తోన్న కూలీ లో కూడా నటిస్తున్నాడు
అయితే వీరందరిలో చిరంజీవి మాస్ హీరో గా ఒక వెలుగు వెలిగారు. రాజకీయాలలో చేరి 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలలోకి వచ్చారు. రీ ఎంట్రీ తరవాత కూడా ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.
గతంలో చిరంజీవి, కోదండరామి రెడ్డి ది కూడా సూపర్ హిట్ కాంబినేషన్. ప్రస్తుతం చిరంజీవి కి కూడా నాగార్జునలాగే ఏ కాంబినేషన్ లు లేవు. చిరంజీవి నటించిన విశ్వంభర సమ్మర్ లో విడుదల అవుతోంది. దీని తరవాత నాని సమర్పణలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇంకా అనిల్ రావిపూడి, బాబీ సినిమాలు ఆఫీషియల్ గా అనౌన్స్ చేయాలి

