వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు భారీ ప్యాకేజి ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

by | Jan 17, 2025 | వార్తలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల భారీ ప్యాకేజిని ప్రకటించింది. తీవ్ర సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవడానికి, నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్ధిక వ్యవహారాల కాబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్యాకేజి కి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు, బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి ధన్యవాదాలు తెలిపారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్  కు కూడా చంద్ర బాబు నాయుడు  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

సుమారు 7 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయగలిగే సామర్ధ్యం ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం గత రెండు సంవత్సరాలలో వేల కోట్ల నష్టాన్ని చవిచూసింది.

ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్యాకేజి విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో పట్టించడానికి ఊపిరి పోసినట్లుంది.  ఇందులో సుమారు పది వేల కోట్లు ఈక్విటీ క్యాపిటల్ గా, సుమారు వెయ్యి పై చిలుకు కోట్లు వర్కింగ్ క్యాపిటల్ గా ఉంటుంది.  ఇకపైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం గాని (ప్రైవేటీకరణ) అనే మాట ఉండదని, వచ్చే రెండు, మూడేళ్ళలో, దేశం లోనే నెంబర్ వన్ ప్లాంట్ గా లాభాల బాట పెట్టిస్తామని ఉక్కు శాఖా మంత్రి కుమార స్వామి గారు చెప్పారు

ఈ నిర్ణయంతో, కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించగలదు అన్న సంకేతాలను ప్రజలలోకి బలంగా పంపించారు.  అంతే కాక, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆత్మ నిర్భర్ భారత్ కు మన రాష్ట్రం తరపున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రధాన పాత్ర పోషించినట్లయింది.

ఇదే, మంచి సమయం, నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం లో, తెలుగు దేశం, జన సేన పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.  ఒక రకం గా చెప్పాలంటే, నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి వచ్చారంటే, దానికి టీడీపీ, జనసేన ఘన విజయమే కారణమని చెప్పవచ్చు.  కూటమి వచ్చాక రైల్వే లైన్లు, స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ వంటివి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి సానుకూలాంశాలు.

ఫిబ్రవరి 1 న ప్రవేశ పెట్టే బడ్జెట్ లో  ఇంకెన్ని రాయితీలు, ప్యాకేజీలు ఇస్తారో చూడాలి