సచిన్ ఫాన్స్ కు గుడ్ న్యూస్

by | Jan 17, 2025 | వార్తలు

సచిన్ ఫాన్స్ కు గుడ్ న్యూస్. సచిన్ టెండూల్కర్ మళ్ళీ బ్యాట్ పెట్టబోతున్నాడు. వచ్చే నెల (ఫిబ్రవరి) 22 నుండి,  మార్చ్ 16 వరకు జరగబోయే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టోర్నమెంట్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆడబోతున్నాడు.  ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తోలి సీజన్ భారత్ లోనే జరుగుతోంది.

నావి ముంబై, రాయపూర్, రాజ్ కోట్ ల లో ఈ మ్యాచ్ లు జరగబోతున్నాయి. భారత జట్టుకు సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహించబోతున్నాడు.  వెస్ ఇండీస్ కు బ్రియాన్ లారా, శ్రీ లంకకు సంగక్కర, దక్షిణ ఆఫ్రికా కు కాళీ, ఇంగ్లాండ్ కు మోర్గాన్, ఆస్ట్రేలియా కు షేన్ వాట్సన్ లు కెప్టెన్ లుగా ఉండబోతున్నారు