ప్రాంతీయ సినిమా ఎల్లలు చెరిపేసిన తెలుగు సినిమా

by | Jan 11, 2025 | సినిమా

భారతీయలు సినిమా టికెట్స్ మీద ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా

ఆర్మాక్స్ మీడియా రిపోర్ట్ ప్రకారం, భారతీయలు 2024 లో 883 మిలియన్స్ సినిమా టికెట్స్ కొన్నారు. ఈ టికెట్స్ కొనడానికి భారతీయులు 11, 833 కోట్లు ఖర్చు పెట్టారట.  2022 లో సుమారు 900 టికెట్స్ కొనడానికి భారతీయులు 10,637 కోట్లు ఖర్చు పెట్టారు

సాధారణం గా నేషనల్ బాక్స్ ఆఫీస్ రెవిన్యూ లో సగం భాగం హిందీ సినిమాల నుండి వస్తుంది.  అయితే 2024 లో హిందీ సినిమాల రిలీజ్ ల తగ్గి పోయాయి.  ఒక స్టేజి లో, సుమారు రెండు నెలల పాటు సరైన రిలీజ్ లు బాలీవుడ్ లో లేవు. 

న్యూ రియాలిటీ ఏంటంటే, ప్రాంతీయ చిత్రాల మాటలు లేవు. ఇప్పుడున్నదల్లా భారతీయ సినిమా.  రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు సినిమా ఎల్లలు చెరిపేశారు.

2024 లో విడుదలైన సినిమాలలో హిందీ 40% తో మొదటి స్థానం లో ఉండగా, తెలుగు సినిమాలు 20% తో రెండవ స్థానంలో ఉంది.  ఆ తరవాత 15% తో తమిళ్ మూడవ స్థానంలో ఉంది.  8% తో హాలీవుడ్, నాలుగవ స్థానంలో ఉంది. మళయాలం సినిమా 10% తో ఐదవ స్థానం లో ఉంది.  కన్నడ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, గుజరాతి సినిమాలన్నీ కలిపి 7%.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దక్షిణాది సినిమా, బాలీవుడ్ తో ఎలా పోటీ పడుతోంది అనేది ఈ నంబర్లు చూస్తే తెలిసిపోతుంది.

2024 లో విడుదలైన సినిమాలలో హిందీ సినిమా 40% తో ఉంటె, దక్షిణాది చిత్రాలన్ని కలిపితే 47%.  సౌత్ డామినేషన్ హిందీ సినిమాలపై ఎంత ఉందనేది చెప్పవచ్చు

బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం చూస్తే, 2024 లో, టాప్ 20 సినిమాలలో, 5 తెలుగు సినిమాలతో మనం అగ్ర స్థానంలో ఉన్నాము.  నాలుగు సినిమాలతో హిందీ, మూడేసి సినిమాలతో తమిళ్, మలయాళ సినిమాలు తరవాతి స్థానాల్లో ఉన్నాయి.

ప్రస్తుతం సౌత్ సినిమాలు, మరి ముఖ్యం గా తెలుగు సినిమాలు, నేషనల్ బాక్స్ ఆఫీస్ నంబర్స్ ను ప్రభావితం చేస్తున్నాయి.  2025 లో బాలీవుడ్ స్టార్స్ సినిమాలా రిలీజ్ లు పెరగాలి.  అప్పుడే నేషనల్ బాక్స్ ఆఫీస్ నంబర్స్ స్టామినా పెరుగుతుంది.

ప్రాంతీయ సినిమా ఎల్లలు చెరిపేసి తెలుగు సినిమా ఇప్పుడు ఉన్నదల్లా భారతీయ సినిమా మాత్రమే