సుప్రీమ్ కోర్ట్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై అక్షింతలు

by | Jan 8, 2025 | వార్తలు

రిటైర్ అయినా జడ్జి లకు సంబంధించి, న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది ధర్మాసనం.  

ఈ సందర్భంలో పదవి విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలకు సంబంధించి, ప్రభుత్వం ఆర్ధిక పరిమితులను పరిగణలోకి తీసుకుంటుందని  అటార్నీ జనరల్ వెంకటరమణి చెప్పారు.  ఈ విషయంపై సుప్రీమ్ ధర్మాసనం తీవ్రం గా స్పందించింది. 

ఎన్నికలప్పుడు, ఉచిత పధకాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉంటాయి కానీ రిటైర్ అయినా న్యాయమూర్తుల పెన్షన్లకు మాత్రం ఆర్ధిక పరిమితులు అడ్డొస్తాయా అని ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద అక్షింతలు వేసింది. 

ఓట్ల కోసం, ప్రస్తుతం, ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో,  ఒక పార్టీ 2500 ఇస్తానంటుంది, మరొక పార్టీ మరింత ఇస్తానంటుంది. రాజకీయ పార్టీలు, ఇలా పోటా పోటీగా, పని చేయని వారికి,  ఓట్ల కోసం, పథకాల పేరుతో డబ్బులు పంచడానికి మాత్రం ఎలాంటి పరిమితులు ఉండవా అని ధర్మాసనం తీవ్రంగా ప్రశ్నించింది

న్యాయ మూర్తులకే న్యాయం జరగట్లేదు, సుప్రీమ్ ధర్మాసనం వ్యాఖ్యలపై, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం సమాధాన, చెప్తాయి.

ఇప్పటికైనా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉచిత పధకాల పేరుతో డబ్బులు పంచడం మానేసి, అభివృద్ధి మీద దృష్టి పెడితే భావి తరాలకు ఒక మంచి సందేశం, భరోసా ఇచ్చిన వాళ్లమవుతాము