టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కక్తనాయకుడిగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెద్ది’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్‌ఇండియా ప్రాజెక్ట్‌లో కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక పెద్ది చిత్రాన్ని 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించారు.
పెద్ది సినిమా లో మొదటి పాట చికిరి చికిరి ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందనే. పెద్ది నుండి మరో మాస్ బీట్ ‘రై రై రారా’ అనే అనే పాటను నిన్న రాత్రి విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ ఆలపించి స్వర పరిచారు. జానీ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు. ఈ పెద్ది చిత్రానికి రత్నవేలు కెమరామెన్ గా వ్యవహరిస్తున్నారు.

