మన శంకర వర ప్రసాద్ గారు 109 కేంద్రాలలో 50 రోజులు

by | Mar 2, 2026 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మనశంకర వరప్రసాద్‌గారు’. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ కీలక పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే  బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన విషయం మనకు తెలిసిందే

 ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.400 కోట్ల  గ్రాస్ వసూళ్లు సాధించి మెగా స్టార్ కెరీర్‌లోనే టాప్ గ్రాస‌ర్‌గా నిలిచింది. అంతే కాదు రీజినల్ సినిమాలలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.  

ఈ రోజు తో మన శంకర వర ప్రసాద్ గారు 50 రోజులు పూర్తి చేసుకుంది.  ఈ సినిమా 109 కేంద్రాలలో అర్ధ శత దినోత్సవం జరుపుకుంది. ఒక పక్క జీ 5 లో మన శంకర వర ప్రసాద్ గారు సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.  ఫిబ్రవరి  28 న జీ తెలుగు లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రసారమయ్యింది.  అయినా ఇప్పటికి కొన్ని సెంటర్లలో సింగల్ స్క్రీన్స్ లలో ఇప్పటికి ఈ సినిమా మంచి వసూళ్లను స్పదింస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు కొత్త పోస్టర్ ని వదిలారు