నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే అంటోన్న పవన్ కళ్యాణ్ : ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాట విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడుగా వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. రాశీఖన్నా కీలక పాత్రలో అలరించనుంది. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. గతంలో పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొంటున్న ఈ సినిమా ఈ సినిమాను 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రబృందం వేగవంతం చేసింది. ఇటీవల రిలీజైన ‘దేఖ్ లేంగే సాలా’ లిరికల్ వీడియో మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి పాట సూపర్ హిట్ కావడంతో సెకండ్ సాంగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్రబృందం ‘ఆరా ఆఫ్ ఉస్తాద్ అనే రెండో సాంగ్‌ను ఈ రోజు విడుదల చేశారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్ తన మార్క్ గ్రేస్‌తో పాటుగా తనదైన స్టైల్‌తో సందడి చేస్తున్నారు. చంద్రబోస్ రాసిన ఈ పాటకు, దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు
ముఖ్యంగా పాటలో వచ్చే ‘నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే’ అనే వాక్యం పవన్ కళ్యాణ్ అభిమానులకు అలరిస్తోంది అని చెప్పవచ్చు. బద్రి సినిమా లో పవన్ కళ్యాణ్ మీద మీద చేయి వేసే మానరిజం బాగా పాపులర్ అయింది. దీనిని ఈ పాట కోసం బాగా వాడుకున్నారు

