కోలీవుడ్ అగ్ర హీరోలు సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) , యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Hasan) కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నట దిగ్గజాలు. వీరి సినిమాలు విడుదల అవుతున్నాయంటే అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. రజినీకాంత్, కమల్ హాసన్ వీరిద్దరిలో ఏ ఒక్కరి సినిమా విడుదలైనా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురుస్తుంది. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విధ్వంసం ఏ రేంజులో ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ నిర్మాణ సారథ్యంలోనే రానున్న ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి సుమారు 46ఏళ్ల తర్వాత నటిస్తున్నారు. 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ సినిమా తర్వాత రజనీకాంత్, కమల్ హసన్ కలిసి నటించలేదు. దాంతో యావత్ సినీ ప్రపంచం ఈ భారీ మల్టీస్టారర్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
జైలర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep Kumar) ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో కమల్, రజినీ తమదైన స్టైల్ తో, స్వాగ్తో కనిపించి అభిమానులకు డబుల్ ధమాకా అందించారు. “ఇంతకీ ఎవరు హీరో అని అడగడం” ఈ గ్లింప్స్‌కే హైలైట్ గా నిలిచింది. ఇక ఈ అనౌన్స్మెంట్ గ్లింప్స్‌లో నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ కూడా కనిపించారు. ముఖ్యంగా ఇద్దరు అగ్ర హీరోలను నెల్సన్ హ్యాండిల్ చేయగలడా అనే అనుమానాలకు ఈ గ్లింప్స్‌తోనే సమాధానమిచ్చాడు నెల్సన్. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ ‘జైలర్ 2’తో సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ముగిశాకే రజినీకాంత్ (Rajanikanth) , కమల్ హాసన్ (Kamal Hasan) భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది ఏదేమైనా ఈ క్రేజీ ప్రాజెక్ట్ మీద అనౌన్స్మెంట్ రావడంతో అటు రజినీకాంత్ ఫ్యాన్స్ ఇటు కమల్ హసన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


