టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) ప్రస్తుతం’ ఫంకీ’ (Funky) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడన్న సంగతి తెలిసిందే. లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ఫంకీ’ చిత్రానికి ‘జాతిరత్నాలు’ఫేం కె.వి.అనుదీప్ (Anudeep) దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ కయాదు లోహర్ కథానాయికగా నటిస్తోండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రేక్షకులు , అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఫిబ్రవరి 11న ఖమ్మంలోని లేక్ వ్యూ క్లబ్ వేదికగా ఈ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైనమెంట్స్ (Sithara Entertainments) తెలిపింది.
ఇక ‘ఫంకీ’ (Funky) సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి ప్రోమో, సాంగ్స్, అప్‌డేట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ మూవీకి సంబంధించి తాజాగా మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి, తాజాగా సెన్సార్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయగా, యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. ఇక మేకర్స్ సినిమా నిడివిని 2 గంటల 08 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. దీంతో రెండున్నర గంటలకుపైగా అనుదీప్ – విశ్వక్ కాంబో స్క్రీన్ పై కడుపుబ్బా నవ్వించడం ఖాయమని అనుకుంటున్నారు అభిమానులు. యూత్ ఆడియన్స్ తో పాటుగా ఫ్యామిలీ వీక్షకులు కూడా ఆకట్టుకునే విధంగా కామెడీ ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.15 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాల్సిఉంటుంది. కాగా, ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైనమెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నాగవంశీ (Naga Vamsi), సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


