‘చికిరి చికిరి’ బ్లాక్ బస్టర్.. ‘పెద్ది’ సెకండ్ సింగిల్‌కి డేట్ ఫిక్స్!

by | Feb 8, 2026 | సినిమా

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెద్ది’. (Peddi) బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) , సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు (Venkata Satish Kilaru) నిర్మించారు. ఇక ఈ చిత్రంలో కన్నడ సీనియర్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక పెద్ది (Peddi) చిత్రాన్ని 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.

ఇదిలావుంటే.. ఇప్పటికే పెద్ది (Peddi) నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా హైప్ కూడా పెంచేసింది. ‘చికిరి చికిరి’ అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్ కి యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్, లక్షల కొద్దీ లైక్స్ తో ఇప్పటికీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇక ఫస్ట్ సింగిల్‌కు వచ్చిన క్రేజ్ చూసిన చిత్ర యూనిట్ సెకండ్ సింగిల్‌పై దృష్టి పెట్టింది. తాజా సమాచారం ప్రకారం ప్రేమికుల దినోత్సవ కానుకగా ఫిబ్రవరి 14న ఈ మూవీ సెకండ్ సింగిల్ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ సాంగ్ లో రామ్ చరణ్ (Ram Charan) క్యారెక్టర్ షేడ్స్ బయటపడనున్నాయని టాక్. ఇప్పటికే పెద్ది సెకండ్ సింగిల్ లోడింగ్ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.