భారీ ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియా వ్యాప్తంగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ అగ్ర హీరోలను కూడా తన స్టార్ డమ్ తో వెనక్కినెట్టేస్తున్నారు ప్రభాస్. సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పటికే ఎన్నో అరుదైన ఎవరికీ సాధ్యం కాని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నారు ప్రభాస్. తాజాగా ఆయన మరో అరుదైన ఘనత సాధించారు. ఇండియన్ సినీ హీరోలలో మరెవ్వరికీ సాధ్యం కాని అరుదైన ఘనత ఇది. ప్రముఖ జపాన్ మ్యాగజైన్ ‘ANAN’ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్‌గా తమ కవర్ పేజీపై ప్రభాస్ (Prabhas) ఫోటోను ముద్రించింది.
జపాన్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన మ్యాగజైన్‌గా ‘ANAN’కు పేరుంది. బాహుబలి (Bahubali) ఫ్రాంచైజీతో జపాన్‌లో అదిరిపోయే క్రేజ్ సంపాదించిన ప్రభాస్‌కు అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ కారణంగానే ‘ANAN’ మ్యాగజైన్ ఎడిటోరియల్ టీమ్ ఆయనను ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఒక ఇండియన్ హీరోకి ఈ స్థాయిలో అంతర్జాతీయ గుర్తింపు రావడం చాలా గొప్ప విషయమని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా అభిమానుల్ని సంపాదించుకున్న ప్రభాస్‌కు ఇప్పుడు ఈ మ్యాగజైన్ కవర్‌తో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగే అవకాశముంది. ఇదిలావుంటే. కెరీర్ ఆరంభం నుంచి ప్రతీ సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ మార్కెట్ పరంగా తనకు తిరుగు లేదు అనే స్థాయికి చేరుకున్నారు ప్రభాస్. Prabhas ఎంచుకునే సినిమాలు కూడా అలాగే ఉంటున్నాయి. రొటీన్ గా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో కథలు ఎంచుకుంటూ వరస చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్.

