శంకర వరప్రసాద్‌గారు’ 25 డేస్ కలెక్షన్స్‌.. ఆల్‌టైమ్‌ ఇండస్ట్రీ రికార్డ్

by | Feb 5, 2026 | సినిమా

తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌ గారు’. సంక్రాంతి కానుక‌గా జనవరి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే రూ.84 కోట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మెగా మూవీ ఇప్పటి వరకూ 25రోజులు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ 25 రోజుల్లో రూ.375 కోట్ల గ్రాస్‌ వసూళ్లు రాబట్టింది. ఈ మేరకు తాజాగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. విడుదలైన ఫస్ట్ వీక్ లోనే మన శంకర వరప్రసాద్‌ గారు రూ.292 కోట్లు కలెక్షన్లు వసూలు చేసింది. కేవలం మొదటి వారంలోనే ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన తొలి రీజనల్ మూవీగా ఆల్‌టైమ్‌ రీజనల్‌ ఇండస్ట్రీ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

ఇక ఇక్కడే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా సుమారు రూ. 5 మిలియన్ల డాలర్లు వసూలు చేయి మెగాస్టార్ కెరీర్‌లోనే 5 మిలియన్ల డాలర్లు సాధించిన సినిమాగా ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ (Mana Shankara Vara Prasad Garu) రికార్డు నెలకొల్పింది. అలాగే ఈ సినిమాకు సంబంధించి ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్‌మైషోలో ఏకంగా 40 లక్షల టికెట్లు అమ్ముడవడం విశేషం. ఇదిలాఉంటే.. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న వారి కోసం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 11 నుంచి తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడతోపాటు మరాఠి, బెంగాలీ భాషల్లో కూడా స్ట్రీమింగ్‌ కానుంది. కాగా, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.