‘విశ్వంభర’ – ఫ్యాన్స్‌కి మెగా గుడ్ న్యూస్ చెప్పిన చిరు

by | Jan 29, 2026 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu)బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో చిరు అభిమానుల్లో విజయోత్సహం నిండిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి (Chiranjeevi) నుంచి రానున్న భారీ చిత్రం ‘విశ్వంభర’(Viswambhara). డైరెక్టర్ వశిష్ఠ రూపొందిస్తున్న ఈ సినిమా వాస్తవానికి ఇప్పటికే ప్రేక్షకుల ముందే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా. కానీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో అత్యుత్తమ అవుట్‌పుట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ రాజీ లేకుండా పని చేస్తున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై మెగాస్టార్ చిరంజీవి స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ఓ ఇంటర్వూలో చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ.. ‘విశ్వంభర’ (Viswambhara) సినిమా జూన్ చివర్లో లేదా జూలై నెలలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. చిరు మాటల్లో దాదాపుగా ఈ సినిమా జూలై 9వ తేదీని విడుదల కానుందని తెలుస్తోంది. ఏదేమైనా ఈ సినిమా విడుదలపై చిరంజీవి మాటలు అభిమానుల్లో సరి కొత్త ఉత్సాహాన్ని నింపాయి. కాగా, డైరెక్టర్ వశిష్ఠ (Vasistha) తెరకెక్కిస్తున్న ఈ సినిమా, కథా పరంగా విజువల్ పరంగా కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మాణం వహిస్తోంది.