T20 Series : అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ ల విధ్వంసం ; సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా
భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోన్న మూడవ టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది
154 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు కు మొదటి బంతికే ఓపెనర్ సంజు శాంసన్ డక్ అవుట్ అయ్యి షాక్ ఇచ్చాడు. అయితే మరో ఓపెనర్ ఇషాన్ కిసాన్ బ్యాట్ ఝుళిపించి 13 బంతుల్లో 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండవ వికెట్ కు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లు 52 పరుగులు జోడించారు
అంతే న్యూజిలాండ్ కు మూడవ వికెట్ దక్కలేదు. అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ లు విధ్వంసం సృష్టించారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. స్వదేశంలో జరిగిన వన్ డే, టెస్ట్ సిరీస్ లలో భారత జట్టును ఓడించారన్న కసితో ఆడారు.
అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్ల 68 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అభిషేక్ ఇన్నింగ్స్ లో 5 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. అభిషేక్ శర్మ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మరో వైపు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఫామ్ అందిపుచ్చుకున్నాడు. వరసగా రెండవ మ్యాచ్ లో చెలరేగిపోయాడు. సూర్య కుమార్ యాదవ్ 26 బంతుల్లో 57 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. సూర్య కుమార్ ఇన్నింగ్స్ లో 3 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి
సూర్య కుమార్ యాదవ, అభిషేక్ శర్మ లు లక్ష్యాన్ని 10 ఓవర్ల లోనే కరిగించేశారు. వీరిద్దరూ కలిసి మూడవ వికెట్ కు 102 పరుగులు జోడించారు.
17 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టిన అభిషేక శర్మ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో 5 మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మూడు మ్యాచ్ లు గెలిచి భారత జట్టు సిరీస్ ను గెలుచుకుంది.
నాలుగవ టి 20 మ్యాచ్ ఈ నెల 28 న విశాఖపట్నం లో జరగనుంది
అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది
34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ జట్టును ఫిలిప్స్, చాప్ మన్ లు ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగవ వికెట్ కు 52 పరుగులు జోడించారు. చాప్ మన్ 23 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అంతకు ముందు ఓపెనర్ కాన్వే ఒక పరుగు చేసి అవుట్ అవగా, రవీంద్ర 4 పరుగులు, సీఫెర్ట్ 12 పరుగులు చేసి అవుట్ అయ్యారు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో 48 పరుగులు చేసిన ఫిలిప్స్ టాప్ స్కోరర్. కెప్టెన్ సాంట్నర్ 27 పరుగులు చేశాడు
భారత జట్టు బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు, హార్దిక్ పాండ్య, బిష్ణోయ్ లు రెండేసి వికెట్లు తీసుకున్నారు. హర్షిత్ రానా కు ఒక వికెట్ దక్కింది.

