‘ఉస్తాద్ భగత్ సింగ్’ – వేసవిలోబాక్సాఫీస్ వద్ద విధ్వంసమే!

by | Jan 26, 2026 | సినిమా

టాలీవుడ్ లో ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) , దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడీగా శ్రీలీల (Sree Leela) , రాశి ఖన్నా (Rasi Khanna) హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్ అప్డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల రిలీజైన ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది.

తాజాగా ఉస్తాద్‌ భగత్‌ సింగ్ (Ustaad Bhagath Singh) నుంచి మరో అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్‌. ‘ఇది ప్రారంభవుతుంది. సంతోషంతో మీ చేతులను పైకెత్తి మన ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ కు జై కొట్టండి. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, కల్ట్‌ కెప్టెన్‌ హరీష్‌ శంకర్‌ కలిసి అద్భుతమైన అనుభూతులతో త్వరలో మీ ముందుకు రాబోతున్నారు.’ అంటూ హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) , చేతులు పైకెత్తిన ఫోటోను షేర్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా, ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి ప్ర‌స్తుతం ఒక అప్‌డేట్ వైర‌ల‌వుతుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే తేదీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ‘పెద్ది’ (Peddi) సినిమా కూడా విడుదల కావాల్సి ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కారణంగా ఆ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయి. ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య, అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, వంశీ, అవినాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.