ఆస్కార్‌-2026 నామినేషన్స్‌.. పోటీ పడుతున్న చిత్రాలివే!

by | Jan 23, 2026 | సినిమా

యావత్ సినీ ప్రపంచం ఎంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 98వ ఆస్కార్ అకాడమీ అవార్డుల నామినేషన్స్ జాబితా తాజాగా విడుదలైంది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఈ అవార్డుల కోసం పోటీ పడుతున్న సినిమాల జాబితాను ఆస్కార్ అకాడమీ తాజాగా ప్రకటించింది. ఈ వేడుక మార్చి 15న లాస్ ఎంజిల్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ఏడాది కొత్తగా క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ కేటగిరీని ప్రవేశపెట్టారు. అయితే ఈసారి భారత్ నుండి ‘ఉత్తమ అంతర్జాతీయ సినిమా’ విభాగంలో బరిలో నిలిచిన ‘హోమ్ బౌండ్’కు నిరాశే ఎదురైంది. ఈసారి ఆస్కార్ నామినేషన్స్ కోసం పోటీపడిన ఏ భారత సినిమా కూడా ఒక్క నామినేషన్ దక్కించుకోలేకపోయింది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల జాబితాలో హాలీవుడ్ డైరెక్టర్‌ రేయాన్‌ కూగ్లర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సిన్నర్స్’ మూవీ రికార్డు స్థాయిలో 16 నామినేషన్స్ సంపాదించడం విశేషం. ఇప్పటివరకూ 14 నామినేషన్స్‌తో ‘ఆల్‌ అబౌట్‌’ ‘ఈవ్‌’, ‘టైటానిక్‌’, ‘లా లా ల్యాండ్‌’ పేరిట ఈ రికార్డు ఉండగా.. తాజాగా ‘సిన్నర్స్‌’ ఆ చిత్రాలను వెనక్కినెట్టింది.

బెస్ట్ ఫిల్మ్ కేటగిరీ

బగోనియా
ఎఫ్‌-1
ఫ్రాంకిన్‌స్టన్‌
హ్యామ్‌నెట్‌
మార్టీ సుప్రీం
వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
ది సీక్రెట్‌ ఏజెంట్‌
సెంటిమెంటల్‌ వాల్యూ
సిన్నర్స్‌
ట్రైన్‌ డ్రీమ్స్‌

బెస్ట్ డైరెక్టర్ కేటగిరీ

క్లోయి జావ్‌: హ్యామ్‌నెట్‌జాష్‌ షాఫ్డీ: మార్టీ సుప్రీంపాల్‌ థామస్‌ ఆండ్రూసన్‌:
వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
యోఆకీమ్‌ ట్రియర్‌: సెంటిమెంటల్‌ వాల్యూ
రేయాన్‌ కూగ్లర్‌: సిన్నర్స్‌

ఉత్తమ నటుడు

తిమోతి చాలమేట్‌: మార్టీ సుప్రీం
లియోనార్డ్‌ డికాప్రియో: వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
ఈథన్‌ హాక్‌: బ్లూ మూన్‌
మైఖేల్‌ బి జోర్డాన్‌: సిన్నర్స్‌
వాగ్నర్‌ మౌరా: ది సీక్రెట్‌

ఉత్తమ నటి

జస్సి బక్లి: హ్యామ్‌ నెట్‌
రోజ్‌ బర్న్‌: ఇఫ్‌ ఐ హ్యాడ్‌ లెగ్స్‌ ఐ వుడ్‌ కిక్‌ యు
కేట్‌ హడ్సన్‌: సాంగ్‌ సంగ్‌ బ్లూ
రెనాటా రైన్సావా: సెంటిమెంటల్ వాల్యూ
ఎమ్మా స్టోన్‌: బగోనియా

ఉత్తమ సహాయ నటుడు

బెనిసియో డెల్‌ టారో: వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
జేకబ్‌ ఎల్రోడి: ఫ్రాంకిన్‌స్టన్ డెల్రాయ్‌ లిండో: సిన్నర్స్‌
షాన్‌ పెన్‌: వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
స్టెలెన్‌ స్కార్స్‌గార్డ్‌: సెంటిమెంటల్‌ వాల్యూ

ఉత్తమ సహాయ నటి

ఎల్‌ ఫ్యానింగ్‌- సెంటిమెంటల్‌ వాల్యూ
ఇంగా ఇబ్సిడాట్టర్‌ లిల్లాస్‌- సెంటిమెంటల్‌ వాల్యూ
ఎమీ మాడిగన్‌- వెపన్స్‌
ఉన్మి మసాకు- సిన్నర్స్‌ టియానా టేలర్‌: వన్‌ బ్యాటిల్‌- ఆఫ్టర్‌ అనదర్‌