మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’.. రిపబ్లిక్ డేకు భారీ సర్‌ప్రైజ్‌

by | Jan 22, 2026 | సినిమా

టాలీవుడ్ యువ కథానాయకుడు మంచు మనోజ్ (Manchu Manoj) నటిస్తోన్న పీరియాడికల్ చిత్రం ‘డేవిడ్ రెడ్డి’ (David Reddy). ఈ సినిమాకు హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. బ్రిటీష్ కాలం నాటి జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మనోజ్‌కు జోడీగా మరియా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోటుకూరి భరత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్‌ చేయగా అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ గ్లింప్స్‌లో విజువల్స్, డైలాగ్స్, డేవిడ్ రెడ్డి బైక్‌ ఈ మూవీపై ఆసక్తిని పెంచేశాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మంచు మనోజ్ (Manchu Manoj) ఈ జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ‘డేవిడ్ రెడ్డి’ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం రోజున ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన ప్రీ లుక్ పోస్టర్ లో హీరో మనోజ్ లుక్ చూస్తే, ఇప్పటివరకు మనోజ్ (Manoj) చేయని క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. కాగా, పాన్ ఇండియా రేంజ్‌లో వస్తోన్న ఈ చిత్రం కోసం మంచు మనోజ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.