ఓవర్సీస్‌ బాక్సాఫీస్‌పై ‘వరప్రసాద్‌గారి’ దండయాత్ర

by | Jan 21, 2026 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) బాక్సాఫీస్ వద్ద తన సత్తాను మరోసారి చాటుతున్నారు. ఆయన హీరోగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సినిమా విడుదలైన అన్ని చోట్లా కళ్లు చెదిరే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తూ.. ఇప్పటికే లాభాల బాట పట్టింది. వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అయితే ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో ముఖ్యంగా యూఎస్ లో సరికొత్త రికార్డులను ఖాతాలో వేసుకుంటుంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఓవర్సీస్‌లో ముఖ్యంగా యూఎస్ $4.2 మిలియన్ల మైలురాయిని అధిగమించి పరుగులు పెడుతోంది. త్వరలోనే ఈ చిత్రం నార్త్ అమెరికాలో $5 మిలియన్ల మైలురాయిని చేరుకునే అవకాశముంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. కాగా, యువ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించగా.. వెంకటేష్ (Venkatesh) కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా.. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు.