టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, బ్యూటీ క్వీన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) జంటగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’.(Anaganagaa Oka Raju) నూతన దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 14న భారీ ఎత్తున రిలీజ్ అయింది. మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగాయి. ట్రైలర్ చూసే మూవీ సూపర్ హిట్ అవుతుందనే అంచనాకి వచ్చారు అభిమానులు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. తనదైన కామెడీ టైమింగ్, పంచులతో నవీన్ పొలిశెట్టి (Navin Polishetty) ప్రేక్షకులకి మంచి మజాని అందించాడు. ఈ క్రమంలోనే సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
వరల్డ్‌వైడ్‌గా 5 రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల (గ్రాస్) మార్క్ అందుకున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. నవీన్ పొలిశెట్టి తన కెరీర్లో నాలుగో సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరడం విశేషం. ఈ సినిమా ఇప్పటిదాకా రూ.100.20 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లోనూ ఈ సినిమా ఆదరగొడుతోంది. ముఖ్యంగా యూఎస్ లో 1.25 మిలియన్ కు పైగా కలెక్షన్స్‌తో ఈ సినిమా స్ట్రాంగ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. కాగా, ఫ్యామిలీ ఎంటర్టైన్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

