‘కల్కి-2’ – ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్

by | Jan 19, 2026 | సినిమా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా వచ్చిన రొమాంటిక్ హారర్ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’ (The Raja Saab) మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జనవరి 9న విడుదలైంది. అయితే ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్ వచ్చినప్పటికీ రాజాసాబ్ కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. ‘ది రాజా సాబ్’తో థియేటర్లలో ఉండగానే ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’ (Fouji) మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ కూడా ప్రారంభమైంది. ఈ రెండు సినిమాలు చేస్తూనే ప్రభాస్ ‘ కల్కి 2 ’ (Kalki2) కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

తాజా సమాచారం ప్రకారం ‘కల్కి 2’ (Kalki 2) మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఈ క్రమంలోనే ఫౌజీ, స్పిరిట్ షూటింగ్‌లకు కొన్ని రోజులు విరామం ఇచ్చి కల్కి సెట్స్‌లో అడుగుపెట్టాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మహాభారత ఇతివృత్తాన్ని సైన్స్ ఫిక్షన్‌తో కలిపి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) భైరవగా, కర్ణగా ద్విపాత్రాభినయం చేయనున్నాడు. అలాగే ఫస్ట్ పార్ట్ ముగిసిన తీరు చూస్తే, సెకండ్ పార్ట్ లో కమల్ హాసన్, ప్రభాస్ మధ్య జరిగే యుద్ధం కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్ ను విజువల్ ఫీస్ట్ గా మలిచేందుకు నాగ్ అశ్విన్ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా జనవరిలో రాజా సాబ్ విడుదల, ఫిబ్రవరిలో కల్కి 2 షూటింగ్ ప్రారంభం కావడం అంటే ఇది ప్రభాస్ అభిమానులు అదిరిపోయే శుభవార్త అనే చెప్పొచ్చు.