ఇండియా పై న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం

by | Jan 14, 2026 | వార్తలు

భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ వన్ డే మ్యాచ్ లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కె ఎల్ రాహుల్ సెంచరీ వృధా అయింది

285 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూ జిలాండ్ జట్టు 46 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది కాన్వే 16 పరుగులు, నికోల్స్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 

అయితే విల్ యంగ్, మిచెల్ లు ఇద్దరూ మూడవ వికెట్ కు 162 పరుగులు జోడించారు. 87 పరుగులు చేసిన విల్ యంగ్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

ఆ తరవాత ఫిలిప్స్ తో కలిసి మిచెల్ న్యూజిలాండ్ ను గెలిపించాడు. ఈ క్రమంలో మిచెల్ వన్ డే ల్లో 8వ సెంచరీ చేశాడు.  వీరిద్దరూ నాలుగవ వికెట్ కు అజేయంగా 78 పరుగులు జోడించారు. మిచెల్ 131 పరుగులతో, ఫిలిప్స్ 32 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచారు

భారత జట్టు బౌలర్ల లో హర్షిత్ రానా, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ లు తలా ఒక వికెట్ తీశారు.

సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి వన్ డే జనవరి 18 న జరగనుంది

అంతకు ముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్ల లో ఏడు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది

భారత జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు మొదటి వికెట్ 70 పరుగులు జోడించి చక్కని ఆరంభాన్ని అందించారు.

24 పరుగులు చేసిన రోహిత్ శర్మ అవుట్ అయిన తరవాత వచ్చిన విరాట్ కోహ్లీ 23 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కెప్టెన్ శుభ్ మన్ గిల్ 53 బంతుల్లో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

కె ఎల్ రాహుల్, జడేజా లు ఐదవ వికెట్ కు 73 పరుగులు జోడించారు. జడేజా అవుట్ అయిన తరవాత కె ఎల్ రాహుల్,  నితీష్ కుమార్ రెడ్డి లు కలిసి ఆరవ వికెట్ కు 57 పరుగులు జోడించారు.

నితీష్ కుమార్ రెడ్డి 20 పరుగులు చేసిన అవుట్ అయిన తరవాత, కె ఎల్ రాహుల్ లోయర్ ఆర్డర్ ఆటగాళ్ల సహకారంతో సెంచరీ పూర్తి చేశాడు.  కె ఎల్ రాహుల్ 92 బంతుల్లో 112 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు 

న్యూజిలాండ్ బౌలర్లలో క్లార్క్ మూడు వికెట్లు తీసుకోగా, జేమిసన్, ఫోక్స్, లెనాక్స్, బ్రేస్ వెల్  లు తలా  ఒక వికెట్ తీసుకున్నారు