మన శంకర వర ప్రసాద్ గారు : మెగా విక్టరీ సాంగ్ ప్రోమో విడుదల

by | Dec 27, 2025 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి నయనతార కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో విక్టరీ వెంకటేష్ అతిధి పాత్రలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే.  మన శంకర వర ప్రసాద్ గారు నుండి చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన పాట ప్రోమో ను విడుదల చేశారు.  పూర్తి పాటను డిసెంబర్ 30 న విడుదల చేయనున్నారు.  న్యూ ఇయర్ పార్టీ లకు ఈ పాట మోత మోగిచ్చేలా ఉంది

జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.