టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ‘మనశంకర వరప్రసాద్‌గారు’. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ కీలక పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా.. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, విడుదలైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను దాటడం విశేషం. తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించిన అధికారిక వివరాల ప్రకారం, కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.261 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
అలాగే ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేయడం మరో విశేషం. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లోను ‘మన శంకరవరప్రసాద్’ గారుకి అద్భుత స్పందన లభిస్తోంది. ఈ సినిమా 2.8 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసి 3 మిలియన్ల మైలురాయికి చేరువవుతోంది. ఈ క్రమంలోనే అంతకుముందు చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా పేరిట ఉన్న 2.7 మిలియన్ల రికార్డ్ ను ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా అధిగమించింది. ఇక ఆన్లైన్ టికెట్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ సినిమా జోరు కొనసాగుతోంది. బుక్ మై షోలో పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హవా చూస్తుంటే లాంగ్ రన్లో భారీగా కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

