మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) మరోసారి తన సత్తా చాటుతూ బాక్సాఫీస్ రికార్డుల దుమ్ము దులుపుతున్నారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సినిమా సూపర్ హిట్ టాక్ తో ఆదరగొడుతోంది. కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.261 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సక్సెస్ మెగాస్టార్ కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు చిరంజీవి తదుపరి సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ముఖ్యంగా చిరంజీవి, బాబీ కాంబోలో రాబోతున్న సినిమా ఇప్పటికే మెగా ఫ్యాన్స్‌లో ప్రత్యేక ఆసక్తిని రేపుతోంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరు, బాబీ (Bobby) కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా 2026, జనవరి 25న ఆదివారం నాడు అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆలస్యం చేయకుండా సినిమాను మొదలు పెట్టాలని భావించిన డైరెక్టర్ బాబీ జనవరి 25న ముహూర్తాన్ని ఫిక్స్ చేశాడట. దాంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలవనుంది. కాగా, కెవిఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

