Author: Krish

‘లైలా’ కలెక్షన్స్‌.. విశ్వక్‌కు కోలుకోలేని షాక్!

మాస్​ కా దాస్ విశ్వక్‌ సేన్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన తాజా సినిమా ‘లైలా’. ద‌ర్శ‌కుడు రామ్ నారాయ‌ణ్ రూపొందించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గార్ల‌పాటి నిర్మించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలోనే విశ్వక్‌ సేన్‌ కెరీర్‌లోనే అతిపెద్ద ప్లాప్ మూవీగా లైలా నిలిచిపోయింది. ఫిబ్రవరి 14న విడుదలైన లైలా మూవీ ఇప్పటి వరకు కేవలం రూ. 3 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించి విశ్వక్ సేన్ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది

తొలి రోజు ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ వీకెండ్ లో అయినా బాక్సాఫీస్‌ వద్ద పుంజుకుంటుంది అని నిర్మాతలు అనుకున్నారు. కానీ ఉహించనిరీతిలో శని, ఆది వారాల్లో ఈ సినిమా షోలు చాలా చోట్ల రద్దయ్యాయి. దీంతో లైలా మూవీ మళ్లీ కొలుకోలేకపోయింది. లైలా మూవీ నిర్మాతకు సుమారు రూ. 10 కోట్లకు పైగానే నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా ఉన్న విశ్వక్ సేన్ కు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు.

నిజానికి ‘లైలా’ మూవీ విడుదలకు ముందే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు రాజకీయ దుమారం రేపాయి. దీంతో ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని ఓ వర్గం పిలుపునిచ్చింది. దీనిపై విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Read More

‘హరిహరవీరమల్లు”లో అలా ఉండబోతుందా.?

‘హరిహరవీరమల్లు”లో అలా ఉండబోతుందా.?

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడుగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో పవర్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. 17వ

Read More

WPL : చెలరేగిన స్మృతి మందన ; డీసీ పై ఆర్సీబీ ఘన విజయం

WPL : చెలరేగిపోయిన స్మృతి మందన ; డీసీ పై ఆర్సీబీ ఘన విజయం
ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో, ఢిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 8 వికెట్ల తేడాతో తేడాతో ఘన విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 19.3 ఓవర్లలో 141 పరుగులకు అల్ అవుట్ అయ్యింది

Read More

మార్చ్ 14 న జన సేన ఆవిర్భావ వేడుకలు

మార్చ్ 14 న జన సేన ఆవిర్భావ వేడుకలు
జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చ్ 14 న నిర్వహిస్తామని ఒక ప్రకటనలో జనసేన పార్టీ తెలిపింది. అంతే కాకుండా ఈ ఆవిర్భావ వేడుకలను పిఠాపురంలో చేపట్టాలని జన సేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయించారని తెలిసింది.

Read More

బ్రేకుల్లేని బండిలా ‘ఛావా’ కలెక్షన్స్‌.. వామ్మో అన్ని కోట్లా!

బ్రేకుల్లేని బండిలా ‘ఛావా’ కలెక్షన్స్‌.. వామ్మో అన్ని కోట్లా!

బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ కథానాయకుడుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘ఛావా’. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవిత కథతో రూపొందిన ఈ సినిమాలో శంభాజీ మహరాజ్‌గా విక్కీ, ఆయన సతీమణి యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు. దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ……

Read More

Recent Comment