భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ లో జరుగుతోన్న నాలుగవ టెస్ట్ లో ఇంగ్లాండ్ (England) జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 669 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.
ఇంగ్లాండ్ అల్ రౌండర్ కెప్టెన్ స్టోక్స్ (Stokes) 141 పరుగుల భారీ సెంచరీ చేశాడు. డాసన్ 26 పరుగులు, కార్స్ 47 పరుగులు చేసి కెప్టెన్ స్టోక్స్ చక్కని సహకారం అందించారు. ఈ మ్యాచ్ లో భారత తొలి ఇన్నింగ్స్ లో స్టోక్స్ 5 వికెట్లు తీసి బౌలర్ గా కూడా రాణించాడు. అంతకు ముందు, జో రూట్ 150 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అంతకు ముందు ఓపెనర్లు క్రాలే 84 పరుగులు, డకెట్ 94 పరుగులు చేయగా, వన్ డౌన్ లో వచ్చిన ఓలి పొప్ 71 పరుగులు చేయడం తో, ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 669 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీనితో ఇంగ్లాండ్ కు 311 పరుగుల ఆధిక్యం లభించింది
భారత జట్టు బౌలర్లలో జడేజా(Jadeja) నాలుగు వికెట్లు తీయగా, సుందర్ 2 వికెట్లు తీశాడు. స్టార్ పేసర్ బుమ్రా రెండు వికెట్లు తీయగా, కాంబోజ్, సిరాజ్ చెరో ఒక వికెట్ తీశారు
ఇంకా 5 సెషన్ ల ఆట మిగిలి ఉండగా భారత జట్టు ఆటగాళ్లు నిలబడతారో, తేలిపోతారో చూడాలి. మొదట, ఇంగ్లాండ్ 311 పరుగుల ఆధిక్యాన్ని కరిగించాలి, ఆ తరవాత ఇంగ్లాండ్ కు లక్ష్యాన్ని నిర్దేశించాలి. రెండవ ఇన్నింగ్స్ లో 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టు. ఓపెనర్ జైస్వాల్ డక్ అవుట్ అవగా, వన్ డౌన్ లో వచ్చిన సుదర్శన్ కూడా డక్ అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో ఇంగ్లాండ్ పేసర్ వోక్స్ ఈ రెండు వికెట్లు తీశాడు
పరిస్థితులను బట్టి చూస్తే, భారత జట్టు డ్రా కోసం పోరాడితే, కనీసం సిరీస్ ఆశలు నిలుస్తాయి. మిగతా 8 మంది ఆటగాళ్లు 5 సెషన్ లు నిలబడాలి. అంటే సుమారు 150 ఓవర్లు దాకా ఆడాలి. దాదాపు అసాధ్యమే. అయితే అనిశ్చితికి మరు పేరైన క్రికెట్ లో ఎప్పుడు, ఏదైనా జరగవచ్చు

