రజనీకాంత్ హీరో గా నటించిన కూలీ సినిమా ఆగష్టు 14 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలవడానికి సిద్ధం అవుతోంది. ఈ లోగా సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తోన్న కూలీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇది ఒక రకంగా రజనీకాంత్ కి, రజనీకాంత్ అభిమానులకు లోకేష్ ఇచ్చిన షాక్ లాంటి వార్తే.
దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ కి కూలి (Coolie) ఏడవ సినిమా.కార్తీ తో తీసిన ఖైదీ, కమల్ హాసన్ తో తీసిన విక్రమ్ చిత్రాలు లోకేష్ కు మంచి పేరు తెచ్చి పెట్టాయి. విక్రమ్ తో తీసిన లియో సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
అయితే ఈ సారి లోకేష్, తన శక్తి సామర్ధ్యాలను పూర్తి స్థాయిలో వాడి కూలి సినిమా ని పాన్ ఇండియా సినిమా గా తీర్చిదిద్దాడు
యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రజనీకాంత్ (Rajanikanth) తో పాటు , నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర , శృతి హాసన్ మరియు బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ నటించారు
బంగారు వాచీల స్మగ్లింగ్, మాఫియా అంశాల చుట్టూ ఈ కధ తిరుగుతుంది అని లోకేష్ కనకరాజ్ ఇప్పటికే చెప్పారు. అయితే సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇవ్వడం చూస్తే ఈ సినిమాలో రక్త పాతం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది, అంతే కాకుండా మాఫియా వాళ్ళు నిత్య జీవితంలో తరచూ వాడే పదాలు కూడా వాడి ఉంటారని తెలుస్తోంది
మరి థియేటర్ యాజమాన్యం 18 సంవత్సరాలు లోపు వారిని అనుమతిస్తారా లేదా అనేది చూడాలి. సహజంగా, ఇలాంటి సినిమాలకు ఫామిలీ ఆడియన్స్ దూరంగా ఉంటారు. ఇప్పుడు సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇవ్వడంతో 18 సంవత్సరాల లోపు వాళ్ళను అనుమతివ్వకపోతే ఈ సినిమా వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే నాని నటించిన హిట్ 3 సినిమాకు కూడా సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. అయినా, దాని ప్రభావం వసూళ్ల మీద పడలేదు
అయితే , సన్ పిక్చర్స్, రజనీకాంత్ కాంబినేషన్ అంటేనే కాసుల వర్షం కురుస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రోబో, జైలర్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించాయి.
ఈ రోజు చెన్నై లో ‘కూలీ’ చిత్రం ట్రయిలర్ విడుదల కార్యక్రమం జరుగుతోంది. ట్రైలర్ విడుదలయ్యాక అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. నాగ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనే దానిపై తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా ఈ కూలి సినిమా ట్రైలర్ గురించి ఎదురు చూస్తున్నారు
విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా కు మిక్స్డ్ టాక్ రావడం తో మరో 10 రోజుల్లో దాని భవితవ్యం తేలిపోతుంది. అయితే యానిమేషన్ సినిమా మహావతార్ నరసింహ వసూళ్లు ఇప్పటికి నిలకడగా ఉన్నాయి. అయితే అదే రోజు (August 14) ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ నటించిన మరో పాన్ ఇండియా సినిమా వార్-2 (WAR-2) కూడా వస్తోంది. మరి ఈ ఇద్దరిలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో చూడాలి.
రజనీకాంత్ తో ఎన్టీఆర్ (NTR) పోటీపడి గెలుస్తాడా, అమిర్ ఖాన్ తో హ్రితిక్ రోషన్ ఢీ కొట్టి నిలబడగలడా, ఈ సినిమా అయినా నాగార్జున కి బ్రేక్ వస్తుందా, రజనీకాంత్ నటించిన కూలి సినిమా అయినా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందా అనేది తెలియాలంటే మరో 12 రోజులు ఆగాలి.


