లార్డ్స్ టెస్ట్ లో జడేజా ఒంటరి  పోరాటం అద్భుతమే, అయితే

by | Jul 16, 2025 | వార్తలు

లార్డ్స్ లో భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు, భారత జట్టు పై 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో గెలుపు ఇంగ్లాండ్ కు ప్రత్యేకం అని చెప్పవచ్చు.  అంతే కాకుండా సిరీస్ లో 2-1 తో ముందడుగు వేయడం కూడా ఇంగ్లాండ్ జట్టుకు సానుకూలాంశం

82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో, రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం అద్భుతం. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి, బుమ్రా, సిరాజ్ లతో కలిసి జడేజా పోరాడిన తీరు స్ఫూర్తిదాయకం. 

మొదటి 82 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన భారత జట్టు, చివరి మూడు వికెట్లకు 88 పరుగులు జోడించిందంటే జడేజా చివరి వరస ఆటగాళ్లతో పోరాడిన తీరు ఎంతో అద్భుతం అని చెప్పవచ్చు

అయితే భారత జట్టు ఓటమికి గల కారణాలను విశ్లేషిద్దాం

  • ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో తొమ్మిదవ నెంబర్ బ్యాట్స్ మెన్ కార్స్ 56 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడడం – ఎనిమిదవ వికెట్ కు స్మిత్, కార్స్ ల 84 పరుగుల విలువైన భాగస్వామ్యం.  
  • 271 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు, చివరకు 387 పరుగులు చేసింది
  • భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది.  చివరి మూడు  వికెట్లకు కేవలం 11 పరుగులు మాత్రమే జోడించింది.
  • మొదటి ఇన్నింగ్స్ లో, భారత జట్టు ఎక్సట్రాల రూపంలో ఇంగ్లాండ్ కు 31 పరుగులు సమర్పించుకుంది.  ఇంగ్లాండ్ జట్టు కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఇక రెండవ ఇన్నింగ్స్ లో కూడా భారత జట్టు 32 పరుగులు ఎక్సట్రాల రూపంలో సమర్పించుకుంది.  ఇంగ్లాండ్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చింది.  అంటే కేవలం ఎక్సట్రాల రూపంలో భారత జట్టు ఇంగ్లాండ్ కు సమర్పించుకున్న పరుగులు 63. ఇంగ్లాండ్ ఇండియా కి ఇచ్చిన పరుగులు 30.   ఇద్దరి మధ్య తేడా 33 పరుగులు.  ఇవే భారత జట్టు కొంప ముంచాయి
  • ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ స్ట్రోక్ అల్ రౌండ్ ప్రదర్శన కూడా కలిసొచ్చిన అంశం.  స్ట్రోక్స్ కెప్టెన్ గానే కాకుండా బ్యాట్స్ మన్ గా 77 పరుగులు, బౌలర్ల 5 వికెట్లు తీశాడు
  • భారత జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ రెండు ఇన్నింగ్స్ లలో ఘోరంగా విఫలమవడం.  గత టెస్టులో రెండు ఇన్నింగ్స్ సెంచరీలు బాదిన గిల్ లార్డ్స్ టెస్ట్ లో పేలవంగా ఆడడం
  • బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన వాషింగ్టన్ సుందర్, బ్యాటింగ్ లో డక్ అవుట్ కావడం. 
  • రవీంద్ర జడేజా బాగానే ఆడిన సిరాజ్ కు ఎక్కువగా స్ట్రైక్ ఇవ్వకుండా జడేజా ఆడాల్సి ఉండాల్సింది.  అప్పటికే నితీష్ కుమార్ రెడ్డి 53 బంతులు, బుమ్రా 54 బంతులు ఆడి జడేజా కు చక్కని సహకారం అందించారు. అయితే సిరాజ్ వచ్చినప్పుడు, జడేజా తానే ఎక్కువ స్ట్రైక్ తీసుకుని ఉండాల్సింది. కానీ ఆలా జరగలేదు. అప్పటికి సిరాజ్ 30 బంతులు ఆడాడు
  • ఓపెనర్ జైస్వాల్ ఫామ్ కూడా కలవర పెట్టె అంశమే

క్రికెట్ అంటేనే అనిశ్చితికి మారు పేరు. ఇవన్నీ మర్చిపోయి కీలకమైన నాలుగవ టెస్ట్ మీద భారత జట్టు దృష్టి సారించాలి