ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీల్ చరిత్రలో రెండవ అత్యధిక ఛేదన ఇది
246 పరుగుల భారీ విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి నుంచి దూకుడుగానే ఆడింది
ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక శర్మ లు మొదటి వికెట్ కు 171 పరుగులు జోడించారు. 37 బంతుల్లో 66 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ చాహల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు
ఆ తరవాత వచ్చిన క్లాసెన్ తో అభిషేక్ శర్మ రెండవ వికెట్ కు 51 పరుగులు జోడించాక, 55 బంతుల్లో 141 పరుగులు చేసిన అభిషేక్ శర్మ అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు
ఆ తరవాత ఇషాన్ కిషన్, క్లాసెన్ లు మరో వికెట్ పడకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ ని గెలిపించారు. క్లాసెన్ 21 పరుగులతో, ఇషాన్ ఇషాన్ 9 పరుగులతో అజేయంగా నిలిచారు
246 పరుగుల భారీ లక్ష్యాన్ని అభిషేక్ శర్మ విధ్వసంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్ల లోనే 247 పరుగులు చేసి ఛేదించింది
246 పరుగులు చేసి ఓడిపోతామని కనీసం కలలో అయినా ఊహించి ఉండరు పంజాబ్ కింగ్స్. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు పిచ్చ కొట్టుడు కొడుతుంటుంటే ఏం చేయాలో అర్ధం కాలేని పరిస్థితి
అభిషేక్ శర్మ కు ఈ రోజు కలిసి వచ్చింది. రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. మొదటి సరి అవుట్ అయినప్పుడు అది నో బాల్ అయ్యింది. రెండవ సారి అభిషేక్ శర్మ ఇచ్చిన క్యాచ్ వదిలేసారు. దీనితో భారీ మూల్యం చెల్లించుకున్నారు పంజాబ్ కింగ్స్
141 పరుగుల విధ్వంసానికి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లబించింది
అంతకు ముందు టాస్ గెలిచినా పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు భారీ స్కోర్ పై కన్నేసి ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది
పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభు సిమ్రాన్ సింగ్ లు మొదటి వికెట్ కు 4 ఓవర్ల లో 66 పరుగులు చేసి సూపర్ శుభారంభాన్నిచ్చారు
13 బంతుల్లో 36 పరుగులు చేసిన ప్రియాంశ్ ఆర్య అవుట్ అయిన తరవాత వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. 23 బంతుల్లో 42 పరుగులు చేసిన ప్రభు సిమ్రాన్ సింగ్ అవుట్ అయిన తరవాత వధేరా, శ్రేయాస్ అయ్యర్ తో కలిసి మూడవ వికెట్ కు 73 పరుగులు జోడించారు
27 పరుగులు చేసిన నేహాల్ వధేరా అవుట్ అయిన తరవాత పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ కొంత తడబాటుకు గురయ్యింది. శశాంక్ సింగ్, మాక్స్ వెల్ లు వెంట వెంటనే అవుట్ అయ్యారు. ఆ తరవాత కొద్దీ సేపటికి, జట్టు స్కోర్ 206 పరుగుల వద్ద, 36 బంతుల్లో 82 పరుగులు చేసిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా అవుట్ అయ్యాడు
చివర్లో స్టయినిస్ ధాటిగా ఆడడంతో పంజాబ్ కింగ్స్ పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టయినిస్ 11 బంతుల్లో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
చివరకు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది
సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు తీయగా, ఇషాన్ మలింగా రెండు వికెట్ లు తీశాడు


