ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది
218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 12 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జైస్వాల్ 6 పరుగులు, నితీష్ రానా 1 పరుగు చేసి అవుట్ అయ్యారు.
ఆయితే కెప్టెన్ సంజు శాంసన్, రియాన్ పరాగ్ లు మూడవ వికెట్ 48 పరుగులు జోడించారు. 14 బంతుల్లో 26 పరుగులు చేసిన రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ లు వెంట వెంటనే అవుట్ అవడంతో రాజస్థాన్ రాయల్స్ కష్టాల్లో పడింది. ఆ తరవాత హేట్మేయర్ తో జత కలిసిన సంజు శాంసన్ ఐదవ వికెట్ కు 48 పరుగులు జోడించారు. 28 బంతుల్లో 41 పరుగులు చేసిన సంజు శాంసన్ అవుట్ అవడంతో రాజస్థాన్ రాయల్స్ కష్టాలు మొదలయ్యాయి
సంజు శాంసన్ అవుట్ అయిన తరవాత ఏ ఒక్క బ్యాట్స్ మన్ హేట్మేయర్ కు సహకారం అందించలేదు. మరో వైపు హేట్మేయర్ ఒంటరి పోరాటం చేశాడు. ఒకానొక దశలో 116 పరుగులకు 5 వికెట్ లు కొల్పిన రాజస్థాన్ రాయల్స్, మరో 43 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లను కోల్పోయింది. ఒంటరి పోరాటంతో 32 బంతుల్లో 52 పరుగులు చేసిన హేట్మేయర్ ఎనిమిదవ వికెట్ గా వెను తిరిగాడు
చివరకు రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్ల లో 159 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ లో ముగ్గురే ముగ్గురు రెండంకెల స్కోర్ చేశారు
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ మూడు వికెట్లు తీయగా, రషీద్ ఖాన్, సాయి కిశోర్ లు రెండేసి వికెట్లు తీశారు. అర్షద్ ఖాన్, కెజ్రోలియా, సిరాజ్ లు తలా ఒక వికెట్ తీశారు
అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్షన్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం లోకి దూసుకెళ్లింది గుజరాత్ టైటాన్స్
అంతకు ముందు టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది
ఇన్నింగ్స్ ప్రారంభించిన కాసేపటికే, రెండు పరుగులు చేసిన కెప్టెన్ శుభ్ మన్ గిల్ వికెట్ ను కోల్పోయింది గుజరాత్ టైటాన్స్. ఆర్చర్ బౌలింగ్ లో గిల్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన బట్లర్ తో కలిసిన సాయి సుదర్శన్ రెండవ వికెట్ కు 80 పరుగులు జోడించారు. అయితే, జట్టు స్కోర్ 94 పరుగుల వద్ద, 25 బంతుల్లో 36 పరుగులు చేసిన బట్లర్ తీక్షణ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు
ఆ తర్వాత వచ్చిన షారుక్ ఖాన్ తో కలిసిన సాయి సుదర్శన్ మూడవ వికెట్ కు 62 పరుగులు జోడించారు. 20 బంతుల్లో 36 పరుగులు చేసిన షారుఖ్ ఖాన్, రూథర్ ఫోర్డ్ లు వెంట వెంటనే అవుట్ అవంతో స్కోర్ వేగం మందగించింది
మరో పక్క ఓపెనర్ సాయి సుదర్శన్ ధాటిగా ఆడుతూ 53 బంతుల్లో 82 పరుగులు చేసి దేశ్ పాండే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
చివర్లో రాహుల్ తేవాతియా, రషీద్ ఖాన్ లు ధాటిగా ఆడడంతో గుజరాత్ టైటాన్స్ స్కోర్ 200 పరుగులకు పైగా చేయగలిగింది. వీరిద్దరూ కలిసి 16 బంతుల్లో 36 పరుగులు చేశారు.
రషీద్ ఖాన్ 4 బంతుల్లో 12 పరుగులు చేసి అవుట్ అవగా, రాహుల్ తేవాతియా 12 బంతుల్లో 24 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.
చివరకు గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది
రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల లో దేశ్ పాండే, తీక్షణ లు రెండేసి వికెట్ లు తీయగా, ఆర్చర్, సందీప్ శర్మ లు చెరో ఒక వికెట్ తీశారు

