ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది
ఇన్నింగ్స్ ప్రారంభించిన కాసేపటికే, రెండు పరుగులు చేసిన కెప్టెన్ శుభ్ మన్ గిల్ వికెట్ ను కోల్పోయింది గుజరాత్ టైటాన్స్. ఆర్చర్ బౌలింగ్ లో గిల్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన బట్లర్ తో కలిసిన సాయి సుదర్శన్ రెండవ వికెట్ కు 80 పరుగులు జోడించారు. అయితే, జట్టు స్కోర్ 94 పరుగుల వద్ద, 25 బంతుల్లో 36 పరుగులు చేసిన బట్లర్ తీక్షణ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు
ఆ తర్వాత వచ్చిన షారుక్ ఖాన్ తో కలిసిన సాయి సుదర్శన్ మూడవ వికెట్ కు 62 పరుగులు జోడించారు. 20 బంతుల్లో 36 పరుగులు చేసిన షారుఖ్ ఖాన్, రూథర్ ఫోర్డ్ లు వెంట వెంటనే అవుట్ అవంతో స్కోర్ వేగం మందగించింది
మరో పక్క ఓపెనర్ సాయి సుదర్శన్ ధాటిగా ఆడుతూ 53 బంతుల్లో 82 పరుగులు చేసి దేశ్ పాండే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
చివర్లో రాహుల్ తేవాతియా, రషీద్ ఖాన్ లు ధాటిగా ఆడడంతో గుజరాత్ టైటాన్స్ స్కోర్ 200 పరుగులకు పైగా చేయగలిగింది. వీరిద్దరూ కలిసి 16 బంతుల్లో 36 పరుగులు చేశారు.
రషీద్ ఖాన్ 4 బంతుల్లో 12 పరుగులు చేసి అవుట్ అవగా, రాహుల్ తేవాతియా 12 బంతుల్లో 24 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.
చివరకు గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది
రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల లో దేశ్ పాండే, తీక్షణ లు రెండేసి వికెట్ లు తీయగా, ఆర్చర్, సందీప్ శర్మ లు చెరో ఒక వికెట్ తీశారు

