ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు
నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి పవన్ కల్యాణ్ గారు ఈ విషయాన్నీ ధ్రువీకరించారు. చిన్న ప్రమాదం అనుకున్నాను. ఇంత పెద్ద ప్రమాదం అని అనుకోలేదు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సమ్మర్ క్యాంపు లో జరిగిన అగ్నిప్రమాదం లో, మార్క్ శంకర్ కళ్ళకు, చేతులకు గాయాలు అయినాయి. ఊపిరితిత్తులలోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకు గురయ్యాడు. స్కూల్ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తీసుకు వెళ్లగా, డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు
పెద్ద కుమారుడు అకిరా పుట్టిన రోజు (ఏప్రిల్ 8) నాడే ఇలా జరగడం బాధాకరం అని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు
పవన్ కళ్యాణ్ తో పాటు, పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ని చూడడానికి, చిరు దంపతులు కూడా సింగపూర్ వెళ్లారు

