టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ మూవీ తెరకెక్కుతోంది. తొలి భాగాన్ని రూపొందించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హెబ్బా పటేల్, వశిష్ట కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్, మధు క్రియేషన్స్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్‌కి, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ వేసవి కానుకగా ఏప్రిల్ 17 న ‘ఓదేల 2’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు చిత్రబృందం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.
‘ఓదెల 2’ (Odela) ట్రైలర్‌ని ఈరోజు (ఏప్రిల్ 8న) సాయంత్రం ముంబైలోని వెస్ట్ బాంద్రాలో ఉన్న గెలాక్సీ థియేటర్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలో విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఓదెల గ్రామాన్ని దుష్ట శక్తుల నుంచి నాగ సాధువు అయిన తమన్నా ఎలా కాపాడుతుంది అనే కథాంశంతో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చిన బ్యాగ్డ్రాప్ మ్యూజిక్ గుస్ బంప్స్ తెప్పించేలా ఉండగా.. తమన్నా యొక్క నాగ సాధువు లుక్, ఆమె యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్ లో హైలైట్‌గా నిలిచాయి. కాగా, ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ముందు ముంబైలో ఉన్న పురాతన శివాలయం అయిన బాబుల్నాథ్ టెంపుల్ని దర్శించుకుంది తమన్నా. ఓదెలా 2 చిత్ర యూనిట్ తో కలిసి బాబుల్నాథ్ ఆలయానికి వెళ్లిన తమన్నా(Tamannah) శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, ‘ఓదెల 2’ సినిమా మొదటి భాగాన్ని మించి ఉండేలా భారీ బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతికతో తెరకెక్కించినట్లు ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో తమన్నా నాగసాధు పాత్రలో నటిస్తోంది. ఈ రోల్ కోసం ఆమె ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుందని ఈ సినిమాలో తమ్మన్నా పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

