ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ 26 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయినా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ప్రభు సిమ్రాన్ సింగ్ లు రెండవ వికెట్ కు 84 పరుగులు జోడించారు. ప్రభు సిమ్రాన్ సింగ్ చెలరేగి పోయి కేవలం 34 బంతుల్లో 3 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
ఆ తరవాత వధేరా తో కలిసిన శ్రేయాస్ అయ్యర్ మరో వికెట్ పడకుండా పంజాబ్ కింగ్స్ ని గెలిపించారు. శ్రేయాస్ అయ్యర్ 30 బంతుల్లో 52 పరుగులు, వధేరా 25 బంతుల్లో 43 పరుగులు చేసి అజేయంగా నిలిచారు
పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్ల లో రెండు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రభు సిమ్రాన్ సింగ్ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ల లో దిగ్వేశ్ రెండు వికెట్లు తీసుకున్నాడు
అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్ల లో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ మార్ష్ డక్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ మార్క్రమ్ ధాటిగా ఆడి 18 బంతుల్లో 28 పరుగులు చేశాడు
పూరం 30 బంతుల్లో 44 పరుగులు చేయగా, ఆయుష్ బాధొని 41 పరుగులు చేశాడు. మిల్లర్ 19 పరుగులు చేయగా చివర్లో సమద్ ధాటిగా ఆడి 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు
కెప్టెన్ రిషబ్ పంత్ 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పూరన్, బదోని లు నాలుగవ వికెట్ కు 54 పరుగులు జోడించారు. ఇదే లక్నో సూపర్ జెయింట్స్ లో అత్యుత్తమ భాగస్వామ్యం
పంజాబ్ కింగ్స్ బౌలర్ల లో అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా, ఫెర్గుసన్, మాక్స్ వెల్, జాన్సెన్, చాహల్ లు తలా ఒక వికెట్ తీశారు

