టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్, బ్యూటీ క్వీన్ శ్రీలీల హీరో, హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’.చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మాతలకుగా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సాయి శ్రీరామ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. భీష్మ సినిమా తర్వాత నితిన్ (Nithin) – వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మువీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఉగాది పండుగ కానుకగా మార్చి 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘రాబిన్‌హుడ్’ సినిమా చిత్ర యూనిట్ మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.
‘రాబిన్‌హుడ్’ (Robinhood) మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేషన్ వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రత్యేక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ రన్ టైమ్ విషయానికొస్తే.. కేవలం 2 గంటల 36 నిమిషాల సాలిడ్ రన్ టైం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా శాటిలైట్ హక్కులతో పాటుగా ఓటీటీ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ‘జీ5’ (ZEE5) ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకోగా.. ‘జీ తెలుగు’ ఈ మూవీ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే.. రాబిన్‌హుడ్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ సినిమాకు ఏపీలో మొదటి వారం రోజుల పాటుగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ సినిమాకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ. 50 పెరుగుతుండగా.. మల్టీప్లెక్స్‌లలో రూ. 75 పెరుగనుంది.

