కీరవాణి పాటకు…  ఇళయరాజా స్వరాలు – సూపర్ కాంబినేషన్

by | Mar 25, 2025 | సినిమా

భారత దేశం గర్వించదగ్గ సంగీత దర్శకులలో కీరవాణి, ఇళయరాజా లు ముందు వరసలో ఉంటారు.  కీరవాణి స్వరాలూ సమకూర్చడమే కాదు అప్పుడప్పుడు పాటలు కూడా రాస్తారు.  ఇప్పటిదాకా సుమారు 60 పాటలు దాకా రాశారు

ఘరానా మొగుడు చిత్రంలో కప్పుకో దుప్పటి, ఆర్ ఆర్ ఆర్ లో జనని పాటలు సంగీత దర్శకుడు ఏం ఏం కీరవాణి రాసినవే

అయితే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలకు మొదటి సారి ఏం ఏం కీరవాణి పాట రాశారు

సూపర్ హిట్ కాంబినేషన్ రాజేంద్ర ప్రసాద్, అర్చన గతంలో లేడీస్ టైలర్ అనే సూపర్ హిట్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.  38 సంవత్సరాల తరవాత రాజేంద్ర ప్రసాద్, అర్చన కలిసి షష్టి పూర్తి చిత్రంలో నటించారు.  ఈ చిత్రంలో రూపేష్, ఆకాంక్ష సింగ్ లు ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు

ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది పవన్ ప్రభ. ఈ చిత్రంలోని ఈ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఏదో ఏ జన్మలోదో అంటూ సాగిన ఈ పాట ఆకట్టుకుంటోంది.