పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ హారర్ చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘కల్కి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి రానున్న సినిమా ఇదే కావడంతో భారీ హైప్ నెలకొంది. హార్రర్ కామెడీ జోనర్‌లో వస్తున్న రాజాసాబ్ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ చిత్ర బృందం ప్రభాస్ (Prabhas) అభిమానులకు సాలిడ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీజర్‌తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ రిలీజయింది. కాని తర్వాత ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దింతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీజర్‌ని విడుదల చేసేందుకు దర్శకుడు మారుతి ప్లాన్ చేస్తున్నాడట.
ఇప్పటికే ఈ టీజర్ కు సంబంధించిన కట్ పూర్తయిందట. మారుతి సన్నిహితులు కొందరు ఎడిట్ వెర్షన్ చూశారట. చూసినవాళ్లంతా వారెవ్వా అంటూ ప్రశంసలు కురిపించారట. టీజర్ మామూలుగా లేదని, ప్రభాస్ (Prabha) ఫ్యాన్స్ చొక్కాలు చింపుకోవడం ఖాయమని తెలుస్తోంది. వచ్చే నెలలో టీజర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా, అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయట. మరోవైపు ఈ సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘ది రాజా సాబ్’ను (Rajaasaab) ఈ ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇంకా చిత్రీకరణ పూర్తికాకపోవడంతో ఇప్పట్లో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ మూవీ రిలీజ్ దీపావళికి వాయిదా వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

