బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘ఛావా’. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటించగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. మహరాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కొడుకు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది. విక్కీ కౌశల్ ఇందులో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయన భార్య యెసుబాయ్ పాత్రను రష్మిక మందన్నా (Rashmika Mandana) పోషించారు. ఇక ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. నెల రోజులు దాటినా కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దింతో 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడంతో పాటుగా విక్కీ కౌశల్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సాధించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ని ఢిల్లీలోని పార్లమెంట్ భవన్ (Parliament Bhavan) లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు సమాచారం. మార్చి 27 గురువారం సాయంత్రం 6 గంటలకి ‘ఛావా'(Chava) మూవీ స్పెషల్ సో ఉండనుండగా.. దీనికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటుగా ఇతర కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాజకీయ ప్రముఖులు హాజరవనున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే.. మార్చి 7న ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ అవగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. అలాగే ‘ఛావా’ మూవీ ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో సైతం అరుదైన రికార్డు సాధించింది. ఈ సినిమాకు సంబంధించి ఏకంగా 12 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడవగా.. ఈ ఘనత సాధించిన తొలి హిందీ చిత్రంగా ఛావా రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇక బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ఎప్పుడొస్తుందా అని సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ‘ఛావా’ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

