టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్, బ్యూటీ క్వీన్ శ్రీలీల హీరో, హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’ (Robinhood) చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మాతలకుగా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సాయి శ్రీరామ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. భీష్మ సినిమా తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మువీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. పైగా ట్రైలర్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. అయితే విడుదలకు ముందే ఈ మూవీ సాలిడ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్ హక్కులతో పాటుగా ఓటీటీ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. హీరో నితిన్ (Nithin) కెరీర్ లోనే భారీ రేటుకు ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ అమ్ముడయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ‘జీ5’ ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకోగా.. ‘జీ తెలుగు’ (Zee Telugu) ఈ మూవీ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక విడుదల తేది దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేశారు. హీరో నితిన్‌తోపాటు ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు హుషారుగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమాలో అతిథి పాత్ర చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్‌గా విచ్చేశాడు. ఈ కార్యక్రమంలోనే చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేశారు.

