టి 20 మ్యాచ్ లో 115 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన పాకిస్థాన్

by | Mar 23, 2025 | వార్తలు

పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగవ వన్ డే లో న్యూజిలాండ్ పాకిస్థాన్ పై 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సీఫెర్ట్ 22 బంతుల్లో 44 పరుగులు, ఫిన్ అలెన్ 20 బంతుల్లో 50 పరుగులు చేశారు.  మార్క్ చాప్ మన్ 24 పరుగులు, మిచెల్ 29 పరుగులు చేయగా, కెప్టెన్ బ్రేస్ వెల్ చెలరేగిపోయి 26 బంతుల్లో 46 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు

పాకిస్థాన్ బౌలర్ల లో హరీస్ రౌఫ్ 3 వికెట్లు తీయగా, అబ్రార్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. అబ్బాస్ ఆఫ్రిది ఒక వికెట్ తీశాడు

అనంతరం 221 పరుగుల భారీ విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ 9 పరుగులకే మూడు కీలక వికెట్ లు కోల్పోయి కష్టాల్లో పడింది. గత మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన హాసన్ నవాజ్, కెప్టెన్ సల్మాన్ ఆఘా చెరో ఒక పరుగు చేసి అవుట్ అయ్యారు

పాకిస్థాన్ ఇన్నింగ్స్ లో ఇర్ఫాన్ ఖాన్, అబ్దుల్ సమద్ లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.  ఇర్ఫాన్ ఖాన్ 24 పరుగులు, అబ్దుల్ సమద్ 44 పరుగులు చేశారు

పాకిస్థాన్ 16.2 ఓవర్ల లో 105 పరుగులకు అల్ అవుట్ అయ్యింది  

న్యూజిలాండ్ బౌలర్ల లో డఫీ నాలుగు వికెట్లు తీయగా, Zakary Foulkes మూడు వికెట్లు తీశాడు. ఒరూర్కే, నీషమ్, ఐష్ సోది లు తల ఒక వికెట్ తీశారు