మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘ఆర్సీ16’ వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోండగా.. కన్నడ చక్రవర్తి శివరాజ్‌కుమార్, దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ గురించి ఓ క్రేజీ అప్టేట్ బయటకొచ్చింది. కాగా, ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమవగా.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన సెట్లో చిత్రీకరణ జరుగుతోందని తెలుస్తోంది.
హీరో రామ్‌చరణ్ (Ram Charan), హీరోయిన్ జాన్వీ కపూర్, విలన్ శివ రాజ్‌కుమార్‌ల కాంబినేషన్ లోని కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తూన్నారట. అలాగే ఈ సినిమాలో క్రికెట్, కుస్తీతో పాటుగా ఇంకొన్ని స్పోర్ట్స్ గురించి కూడా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ షెడ్యూల్లోనే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమైందని తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ ‘జైలర్’ మూవీ ఫేమ్ కెవిన్ కుమార్ ఆధ్వర్యంలో జరుగనుందని తెలుస్తోంది. సినిమాకే ఈ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలువనుందని అంటున్నారు. కాగా, భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్. కాగా, మార్చి 27న రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు కానుకగా టైటిల్, టీజర్ విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా, భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు.

