ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో భాగంగా ఇండియా మాస్టర్స్ ఆస్ట్రేలియా మాస్టర్స్ పై మొదటి సెమి ఫైనల్ లో ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెల్సిందే.
సెమి ఫైనల్ లో సచిన్, యువరాజ్, బిన్నీ లు రాణించడం మొదట భారీ స్కోర్ చేసిన ఇండియా మాస్టర్స్ ఆ తరవాత నదీమ్, వినయ్ కుమార్ ల పదునైన బౌలింగ్ తో ఆస్ట్రేలియా మాస్టర్స్ నడ్డి విరిచారు
నిన్న శ్రీలంక మాస్టర్స్, వెస్ట్ ఇండీస్ మాస్టర్స్ మధ్య జరిగిన రెండవ సెమి ఫైనల్ లో వెస్ట్ ఇండీస్ మాస్టర్స్ 6 పరుగుల తేడాతో శ్రీ లంక మాస్టర్స్ పై విజయం సాధించి ఫైనల్ కు చేరింది
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు ఇండియా మాస్టర్స్, వెస్ట్ ఇండీస్ మాస్టర్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ ను సచిన్, లారా ల మధ్య పోరుగా అభిమానులు చూస్తున్నారు
మరో పక్క ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ కూడా ఈ రోజు జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది
మార్చ్ 22 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఆరంభమవుతుంది

