టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. సినీ రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలను గానూ యూకే పార్లమెంట్ గుర్తించింది. ఈ క్రమంలోనే చిరుకు జీవిత సాఫల్య పురస్కారాన్ని యూకే ప్రభుత్వం ప్రకటించింది. సినీ రంగంలో చిరంజీవి అందిస్తున్న సేవలకు అవార్డు అందించనున్నట్లు తెలిపింది. మార్చి 19న యూకే పార్లమెంటులో ఈ అవార్డును చిరంజీవికి అందజేయనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూకే ప్రభుత్వం ఈ అవార్డును అందించిన విషయం తెలిసిందే. దింతో చిరుకు శుభాకాంక్షలు చెబుతూ పలువురు సినీ తారలు, రాజకీయ నాయకులు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు చిరుకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక చిరంజీవి నటుడు గానే కాకుండా రాజకీయ నాయకుడుగా, సామాజిక సేవకుడుగా విశేష సేవలందించిన సంగతి తెలిసిందే. నాలుగు దశాబ్దాల నట ప్రస్థానంలో 150కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ ఇతర దక్షిణాది చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు. ఇక సినిమాల విషయనికొస్తే.. చిరంజీవి కథానాయకుడిగా యువ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ మెగా అభిమానుల్లో తెగ ఆసక్తి పెంచింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండేది. కానీ గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ‘విశ్వంభర’ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటుడు సాయధరమ్ తేజ్‌తో పాటు మెగా డాటర్ నిహారికా కొణిదెలా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో అషికా రంగనాథ్, మృణాల్ ఠాకూర్, కునాల్ కపూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రలు పోషించనుండగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


