‘కాంతార’తో భారతీయ సినీ ప్రేక్షకులను అలరించిన కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి (Rishab Shetty) ‘జై హనుమాన్’లో ఆంజనేయస్వామి పాత్రలో అలరించనున్న సంగతి తెలిసిందే. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ(Prashanth Varma) తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీ సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.. దీనికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ (jai Hanuman) చిత్రాన్ని ప్రకటించారు దర్శకుడు ప్రశాంత్. ఇందులో ప్రధాన పాత్రలో రిషబ్ శెట్టి కనిపించనున్నారు. ఈ సినిమాను ప్రకటించి చాలా రోజులే అయింది. దీనికి సంబంధించి రిషబ్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ఇంకా సినిమా ప్రారంభం కాలేదు. అయితే రిషబ్ బిజీగా ఉండటం, డేట్స్ కుదరక ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం పట్టాలెక్కేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. పౌరాణిక గాథను ఆధునిక సాంకేతికతతో కలగలిపి విజువల్ ఫీస్ట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనే లక్ష్యంతో చిత్రబృందం పని చేస్తోంది. ఇక ఈ ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 22న ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశమైన హంపిలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించనున్నారు.
హంపి వంటి ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంలో సినిమాను మొదలుపెట్టడం ద్వారా సినిమాకు దైవం కూడా అండగా ఉంటారనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకలో చిత్రబృందంతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నెల నుంచి ప్రారంభం కానుండగా.. రిషబ్ శెట్టి (Rishab Shetty) వరుసగా ఐదారు నెలలు ప్రశాంత్ వర్మకి (Prashanth Varma) కాల్షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్తే అవుతుంది. కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండటం విశేషం. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ మూవీ 2026 మార్చిలో సెట్స్ పైకి వెళ్తే, పోస్ట్-ప్రొడక్షన్, గ్రాఫిక్స్, ప్రమోషన్స్ అన్నింటినీ కలుపుకుంటే ఈ సినిమా విడుదలకు కనీసం 2027 చివరి వరకు వేచి చూడాల్సి రావచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


