‘వారణాసి’ : రాజమౌళి-మహేశ్‌ పారితోషికం అంతా ఆ పద్దతిలోనే.!

by | Feb 9, 2026 | సినిమా

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపొందుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. మహేశ్‌బాబు (Mahesh Babu) ఇందులో రుద్ర అనే పాత్రలో నటిస్తుండగా.. విలన్‌ ‘కుంభ’గా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, మందానికిగా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కనిపించనున్నారు. ఇక కేఎల్‌ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ భారీ పానిండియా సినిమాను సుమారు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండ‌గా, క‌థ విజయేంద్ర ప్రసాద్ అందించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 07, 2027న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ఇటీవలే చిత్రబృందం ప్రకటించారు.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్‌ ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. ఈ సినిమాకు గాను దర్శకుడు రాజమౌళి, హీరో మహేశ్‌ బాబు ఓ సరికొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం ముగిసే వరకు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ అనేది తీసుకోవద్దని రాజమౌళి నిర్ణయించుకున్నారట. రాజమౌళి (Rajamouli) గత సినిమాలకు కూడా పూర్తిగా రెమ్యునరేషన్ తీసుకునేవాడు కాదు. కొంత డబ్బు ముందుగా తీసుకొని ఆపై సినిమా లాభాల్లో వాటా తీసుకునేవాడు. అయితే వారణాసి (Varanasi) సినిమాకు మాత్రం ముందుగా రెమ్యునరేషన్ అనేదే లేకుండా పని చేస్తున్నాడట రాజమౌళి. ఈ సినిమాకు రెమ్యునరేషన్ గా ఓవర్సీస్‌ రైట్స్‌ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక రాజమౌళి మాదిరిగానే హీరో మహేశ్‌ బాబు (Mahesh Babu) కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం సినిమా నిర్మాణంలో భాగస్వామిగా మాత్రమే ఉన్నారట. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఒక వేళ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిస్తే ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం రాజమౌళి ఓవర్సీస్‌ రైట్స్‌ దక్కించుకోవడం ద్వారా ఆయనకు రూ. 120 నుంచి 150 కోట్లకు పైగా లాభం వచ్చే అవకాశముంది. అలాగే ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న మహేశ్‌ బాబుకు రూ. 150 నుంచి 200 కోట్ల వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే అటు రాజమౌళి ఇటు మహేశ్ ఈ సరికొత్త స్ట్రాటజీతో ‘వారణాసి’ (Varanasi) సినిమా చేస్తున్నట్లుగా తెలుస్తోంది.