T20 World Cup : టి 20 వరల్డ్ కప్ లో భాగంగా భారత, యూ ఎస్ ఎ జట్ల జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి భారత జట్టుకు మొదట బ్యాటింగ్ అప్పగించింది యూ ఎస్ ఎ. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది
అభిషేక్ శర్మ టి 20 వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ లో గోల్డెన్ డక్
అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ రెండవ ఓవర్ రెండవ బంతికి గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ నిలదొక్కుకున్నట్లుగా కనిపించినా ఇద్దరు వెంట వెంటనే అవుట్ అవడంతో భారత జట్టు కష్టాలు మొదలయ్యాయి. ఇషాన్ 20 పరుగులు, తిలక్ వర్మ 25 పరుగులు చేశారు.
ఆ తరవాత వచ్చిన శివమ్ దూబే సైతం మొదటి బంతికే అవుట్ అవడం, రింకు సింగ్ 6 పరుగులు, హార్దిక్ పాండ్య 5 పరుగులు చేసి అవుట్ అవడంతో 77 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి భారత జట్టు పీకల లోతు కష్టాల్లో పడింది
అయితే ఆపద్బాంధవుడు, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మరోవైపు నిలకడగా ఆడడమే కాక స్కోర్ బోర్డు ను కదిలిస్తూ వచ్చాడు. సూర్య కుమార్ యాదవ్ ఏడో వికెట్ కు అక్షర్ పటేల్ తో కలిసి 41 పరుగులు జోడించాడు
లోయర్ ఆర్డర్ ఆటగాళ్ల సహాయంతో సూర్య కుమార్ యాదవ్ భారత జట్టు 161 పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు
సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సూర్య ఇన్నింగ్స్ లో నాలుగు సిక్సర్లు, పది ఫోర్లు ఉన్నాయి
161 పరుగులు యూ ఎస్ ఏ లాంటి కొత్త జట్లకు భారీ టార్గెట్ అనే చెప్పాలి. 162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన యూ ఎస్ ఎ జట్టు భారత జట్టు పేస్ బౌలర్లను ఎదుర్కోవడానికి తడబాటుకు గురయింది. యూ ఎస్ ఏ జట్టు 13 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ మొనాక్ పటేల్ డక్ అవుట్ అయ్యాడు
యూ ఎస్ ఏ జట్టులో సంజయ్ కృష్ణమూర్తి 37 పరుగులు, మిలింద్ కుమార్ 34 పరుగులు, శుభమ్ రంజనే 22 బంతుల్లో 37 పరుగులు మినహా మిగతా ఎవరు చెప్పుకోదగిన స్కోర్ చేయలేదు. చివరకు యూ ఎస్ ఎ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది
భారత జట్టు బౌలర్లలో అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కి ఒక వికెట్ లభించింది. హర్షిత్ రానా గాయపడడంతో జట్టులోకి వచ్చిన సిరాజ్ మూడు వికెట్లు తీసుకున్నాడు.
మ్యాచ్ ఓడినప్పటికీ యూ ఎస్ ఎ జట్టు బౌలింగ్ లో చక్కటి ప్రదర్శన కనపరించింది. భారత జట్టును దాదాపుగా అల్ అవుట్ చేసిందనే చెప్పవచ్చు

