‘NBK 111’ కథనే మార్చేశారుగా.. ముంబై గ్యాంగ్‌స్టర్‌గా బాలయ్య!

by | Feb 7, 2026 | సినిమా

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Bala Krishna) ప్రస్తుతం తన కెరీర్ లో 111వ చిత్రం కోసం సిద్ధమవుతున్నారన్న సంగతి తెలిసిందే. ‘ఎన్‌బీకే 111’ (NBK 111) వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి గోపీచంద్‌ మలినేని (Gopi Chand Malineni) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ఎస్‌.తమన్ మ్యూజిక్‌ అందించగా.. వృద్ధి సినిమాస్‌ (Vruddi Cinemas) బ్యానర్‌పై సతీష్‌ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్‌ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే అంచనాలేర్పడ్డాయి.

అయితే ఈ సినిమా కోసం మొదట ఓ హిస్టారికల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినప్పటికీ బడ్జెట్‌ తో పాటు ఇతర కారణాల వల్ల ఆ స్క్రిప్ట్ ను పక్కనపెట్టి మరో కొత్త కథతో ఈ సినిమాను చేయనున్నారట. తాజా సమాచారం ప్రకారం ముంబై మాఫియా బ్యాగ్డ్రాప్ లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందనుందని తెలిసింది. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ (Bala Krishna) గత సినిమాల తరహాలో డ్యూయల్ రోల్ లో కాకుండా ఈ సినిమాలో సింగిల్‌ రోల్ లోనే కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ఈ సినిమాలో రెండు పాత్రలు ఉంటాయని వార్తలు వినిపించాయి. కానీ ఇందులో బాలకృష్ణ ఒక్క క్యారెక్టర్ లోనే కనిపించనుండగా.. అది కూడా పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ షేడ్‌లో ఉండబోతోందని తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ (Gangster)బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి తొలి వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో నయనతార (Nayanathara) కథానాయికగా నటించనుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు మేకర్స్.