సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా అగ్ర దర్శకుడు రాజమౌళి (Raja Mouli) తెరకెక్కిస్తున్న క్రేజీ మూవీ ‘వారణాసి’. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ భారీ పానిండియా సినిమాను సుమారు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, కథ విజయేంద్ర ప్రసాద్ అందించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌కు సంబంధించి ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తాజా సమాచారం ప్రకారం వారణాసి (Varanasi) మూవీ తదుపరి షెడ్యూల్‌ను జార్జియాలో నిర్వహించేందుకు రాజమౌళి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
జార్జియాలో కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారట. జార్జియాతో పాటు అంటార్కిటికా వంటి అరుదైన ప్రదేశంలో కూడా ఈ సినిమాను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరున చిత్ర బృందం అక్కడి మంచు కొండల మధ్య భారీ యాక్షన్ సీక్వెన్సులను చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక అంటార్కిటికాలో ఈ సినిమా షూటింగ్ జరగనుండడంతో ఓ అరుదైన ఘనతను సాధించనుంది. ఈ క్రమంలోనే అంటార్కిటికాలో చిత్రీకరించిన సినిమాల జాబితాలో వారణాసి (Varanasi) అయిదవ చిత్రంగా అలాగే ఈ ఘనత సాధించిన తొలి భారత చిత్రంగా నిలవనుంది. గతంలో ‘ది థింగ్’, ‘ఎయిట్ బిలో’, ‘ఎన్‌కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్’ వంటి హాలీవుడ్ చిత్రాలు మాత్రమే అంటార్కిటికాలో చిత్రీకరణ జరుపుకున్నాయి. ఇక వారణాసి సినిమా ఇప్పటికే కెన్యా, దక్షిణాఫ్రికాతో పాటు పలు అంతర్జాతీయ లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 07, 2027న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ ప్రకటించారు

