పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ (Raja Saab) సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర వసూళ్లు సాధించలేకపోయింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత విశ్వప్రసాద్ రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే ఈ మూవీ ఇప్పటి వరకూ రూ. 250 కోట్ల మేరకు మాత్రమే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టింది. దీంతో నిర్మాతకు తీవ్ర నష్టం వాటిల్లింది. గతంలో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ రైట్స్ ను కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత విశ్వప్రసాద్ తీసుకున్నారు. ఆ సినిమా కూడా నష్టాలు చవిచూడడంతో.. ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చారు ప్రభాస్.
ఈ క్రమంలోనే సదరు నిర్మాణ సంస్థతో ‘రాజాసాబ్’ చిత్రాన్ని చేశారు. అయితే ఇప్పుడు రాజాసాబ్ (Raja Saab) సినిమా కూడా నష్టాలు మిగల్చడంతో ఇప్పుడు కూడా నిర్మాతకు అండగా నిలిచాడట ప్రభాస్. దీంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) సంస్థను కాపాడేందుకు ప్రభాస్ (Prabhas) మరో సినిమా చేస్తానని మాటిచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో చేస్తున్న ‘స్పిరిట్’ (Spirit) మూవీ రైట్స్ ను మైత్రీ మూవీస్‌తో పాటుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అందేలా చేశారు ప్రభాస్. వీటితో పాటుగా రాజాసాబ్ సినిమా కోసం ప్రభాస్ పూర్తి పారితోషికాన్ని కూడా తీసుకోలేదని తెలుస్తోంది. కేవలం అడ్వాన్స్‌గా కొంత మొత్తం మాత్రమే తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, ప్రభాస్ ప్రస్తుతం కెరీర్‌లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ (Fouji)షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అలాగే సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ కూడా తాజాగా సెట్స్‌పైకి వెళ్లింది. వీటికి పాటుగా ‘సలార్-2’ (Salaar), ‘కల్కి-2’ (Kalki) కూడా ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి.

